Home తెలంగాణ TS Inter Hall Ticket 2024 : తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు

TS Inter Hall Ticket 2024 : తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు

0

ఇంటర్ పరీక్షలు, ఫలితాల నేపథ్యంలో ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు ‘టెలి-మానస్’ సేవలను ఇంటర్ బోర్డు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒత్తిడి ఫీల్ అయ్యే విద్యార్థులు టెలీ – మానస్ కు కాల్ చేసి నిపుణులతో కౌన్సిలింగ్ తీసుకోవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఇందుకోసం వైద్యారోగ్యశాఖకు చెందిన టెలీ మానస్‌ సేవలను ఉచితంగా వినియోగించుకోనున్నట్లు తెలిపింది. విద్యార్థులు 14416 టోల్‌ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని వెల్లడించింది. ఈ టెలి మానస్‌(Tele Mental Health Assistance and Networking Across States) ద్వారా విద్యార్థులు పరీక్షలను ఎదుర్కోవడానికి కావాల్సిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇవ్వడమేగాక మార్గదర్శనం చేయనున్నట్టు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. భయం, ఆందోళన, ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రయత్నిస్తారని… ఇవే కాకుండా ప్రభుత్వ దవాఖానల్లో జిల్లా మెంటల్‌ హెల్త్‌ క్లినిక్‌ల సేవలను 24 గంటల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చని వివరించింది.

Exit mobile version