Home తెలంగాణ Eatala Rajender : పార్లమెంట్ ఎన్నికల బరిలో ‘ఈటల’

Eatala Rajender : పార్లమెంట్ ఎన్నికల బరిలో ‘ఈటల’

0

మరోవైపు మల్కాజిగిరి స్థానానికి ఎక్కువ మంది నేతలు దరఖాస్తులు చేసుకోవటం కూడా ఆ పార్టీలో ఆసక్తికరంగా మారింది. ఈ సీటు కోసం మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాత్రమే కాకుండా…. జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు ఆశిస్తున్నారు. దశాబ్దాలుగా తనకున్న జాతీయస్థాయి అనుభవం, పార్టీతో తనకు ఉన్న అంకితభావం వంటి అంశాలు పరిగణలోకి తీసుకొని పోటీకి అవకాశం ఇవ్వాలని ఆయన అడుగుతున్నట్లు తెలుస్తుంది. వీరే కాకుండా మాజీ ఎంపీ చాలా సురేష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ,బిజెపి రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు హరీష్ రెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి,కొంపల్లి మోహన్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత కొమరయ్య,బీజేపీ అధికారి ప్రతినిధి తుళ్ళ వీరేంద్ర గౌడ్ కూడా ఈ సీటును ఆశిస్తున్నారు.దీంతో ఈ స్థానం లో ఎవరిని బరిలోకి దింపాలనేది బీజేపీ అధిష్టానానికి అప్పగించినట్లు పార్టీ వర్గాల్లో జరుగుతుంది.

Exit mobile version