మేష రాశి
శని, బుధుడు, సూర్యుడి కలయిక వల్ల మేష రాశి వారికి అద్భుత ప్రయోజనాలు కలగబోతున్నాయి. వృత్తి జీవితంలో వచ్చే ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులు, సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. కుటుంబ సమేతంగా ఎక్కడికైనా ట్రిప్ కి వెళతారు. ఈ సమయంలో వైవాహిక జీవితం కూడా ప్రేమతో నిండిపోతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో విజయం సాధించేందుకు అనేక అవకాశాలు వస్తాయి. ఐటీ, హెల్త్ కేర్ నిపుణులకి విదేశాల్లో పని చేసేందుకు ఆఫర్లు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.