Home తెలంగాణ భద్రాద్రిలో 4 క్వింటాళ్ల గంజాయి పట్టివేత-four quinta of ganja seized at bhadrachalam in...

భద్రాద్రిలో 4 క్వింటాళ్ల గంజాయి పట్టివేత-four quinta of ganja seized at bhadrachalam in bhadradri kothagudem district ,తెలంగాణ న్యూస్

0

గంజాయిని ఒడిస్సా రాష్ట్రం మల్కనగిరి నుంచి కోలా ఆనంద్ అలియాస్ బుజ్జి, బాల్ రెడ్డిల నుంచి సుమారు 4 క్వింటాళ్ల గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆ గంజాయిని ప్లాస్టిక్ ట్రేల అడుగు భాగంలో డోర్ మ్యాట్ల మధ్య భాగాన్ని కత్తిరించి వాటిని ఒక దానిపై మరొకటి పేర్చారని తెలిపారు. వాటి మధ్య భాగాలలో గంజాయి ప్యాకెట్లను ఎవరూ కనిపెట్టకుండా దాచిపెట్టి సాధారణ ప్రయాణికుల్లాగా బస్సు సిబ్బందిని, తోటి ప్రాయణికులను నమ్మించి ప్లాస్టిక్, డోర్ మ్యాట్లు అమ్మే వారిలా నటిస్తూ అక్రమంగా గంజాయిని హైదరాబాద్ కు తరలించి అక్కడ అవసరం ఉన్న వ్యక్తులకు అధిక ధరకు విక్రయించే ఉద్దేశంతో వీళ్ళు వెళుతున్నారని తెలిపారు. భద్రాచలం పట్టణ పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. హర్యానా రాష్ట్రంకు చెందిన బల్జీత్, రవిదాస్, సూరజ్ బాన్, గీన్న, తక్ దిర్, రామ్మోహర్, సుందర్, రాజ్పాతిలపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.

Exit mobile version