షీనా బోరా హత్య కేసులో ఎన్నో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా కూడా అరెస్ట్ అయ్యారు. సీబీఐ వేగంగా విచారణ చేసింది. అయితే, 2022 మేలో ఇంద్రాణియా ముఖర్జీకి బెయిల్ వచ్చింది. దీంతో ఆమె ప్రస్తుతం బయట ఉన్నారు. అన్బ్రోకెన్: ది అన్టోర్డ్ స్టోరీ పేరుతో ఆమె గతేడాది ఓ బుక్ రాశారు. జైలు జీవితంతో పాటు పలు అంశాలను ఇంద్రాణి ఆ బుక్లో వెల్లడించారు.