ఇదీ జరిగింది..
ఈ ఘటన 2023 అక్టోబర్ నాటిది! యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్.. 2023 సెప్టెంబర్‌లో గుర్గావ్లోని మరో ఇంటికి వెళ్లారు. అక్టోబర్ 5న.. పంచ్‌కులలోని ఎండీసీ సెక్టార్ 4లో ఉన్న నివాసానికి తిరిగి వచ్చారు. యువరాజ్ ఇంట్లో దొంగతనం జరిగిందని, రూ. 75వేల నగదు, ఎంతో విలువ చేసే జ్యువెల్లరీ కనిపించడం లేదని ఆమె గుర్తించారు. ఈ నేపథ్యంలోనే.. హౌజ్ కీపింగ్ స్టాఫ్ లలితా దేవి, సిల్దార్ పాల్‌పై ఆమెకు అనుమానం మొదలైంది. ఆమె సొంతంగా అసలు విషయం తెలుసుకోవాలని భావించి, అనుమానితుల కదలికలను గమనించారు. కానీ ఎలాంటి క్లూ లభించలేదు.