Home తెలంగాణ Hyderabad Robbery Case : ముందుగా రెక్కీ, ఆపై కస్టమర్ గా వచ్చి

Hyderabad Robbery Case : ముందుగా రెక్కీ, ఆపై కస్టమర్ గా వచ్చి

0

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం……ముంబైకి చెందిన నజీమ్ అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తన తల్లితండ్రులు మరియు సోదరి కొన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. నజీమ్ చిన్న వయసులోనే విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి ఎక్కువగా డబ్బు ఖర్చు చేసేవాడు.దీంతో అతడి తండ్రి హాసన్ తన సంపాదన, ఆస్తిని కుమారుడి చేతికి అందకుండా కట్టడి చేశాడు.దీంతో తాను డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొన్నేళ్లుగా ఆఫ్రికా ,చైనా, అమెరికాలో పలు ఉద్యోగాలు చేశాడు.2022లో తిరిగి ఇండియా కు వచ్చిన నజీమ్.ముంబైకి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఒక పాప కూడా ఉంది.కాగా నజీమ్ ప్రవర్తన నచ్చక ఆ యువతి కొన్ని నెలలుగా తన కుమార్తెతో వేరుగా ఉంటుంది. లండన్ వెళ్లి సెటిల్ కావాలనే ప్రయత్నాల్లో ఉన్న నజీమ్ కు కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురు అవుతుండడంతో 2023 లో హైదరాబాద్ నగరానికి వలస వచ్చి కొంపల్లి లో నివాసం ఉంటున్నాడు. తొలుత ఓ బైక్ టాక్సీ కంపెనీలో డ్రైవర్ గా పని చేసిన ఇతడు కొన్ని రోజులకు….తానే సొంతంగా మూడు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేశాడు.అందులో ఒకటి నజీమ్ నడుపుతూ ఉండగా……మిగతా రెండు బైకులను కిరాయికి నడిపేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి జీడిమెట్ల లో నివాసం ఉంటున్న షాకర్,వారిస్ లను నియమించాడు. నజీమ్ కొన్నాళ్ళ క్రితం ఓ కస్టమర్ ను తీసుకొని బైక్ పై కిస్ వా జ్యువలర్స్ కి వెళ్ళాడు. అక్కడే దాదాపు 15 నిమిషాలు గడిపిన అతడికి ఆ దుకాణం ఉన్న ప్రాంతం, అందులోనే పరిస్థితుల్లో లోపాలతో పాటు అక్కడ పని చేయడానికి వర్కర్స్ ఎవరూ లేకుండా యాజమని ఒక్కడే ఉంటాడని నజీమ్ గుర్తించాడు.

Exit mobile version