మేష రాశి
మేష రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులకు కాలం కలిసివస్తుంది. వ్యాపార విస్తరణకు మంచి సమయం. విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం అవకాశాలు రావచ్చు. ఆర్థికంగా మధ్యస్థంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. మేష రాశి వారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుడిని పూజించినట్లయితే మరింత శుభఫలితాలు కలుగుతాయి.