Home తెలంగాణ మేడారం జాతరకు వెళ్తున్నారా..? అయితే వీటిని కూడా చూసి రండి-if you are going to...

మేడారం జాతరకు వెళ్తున్నారా..? అయితే వీటిని కూడా చూసి రండి-if you are going to medaram sammakka sarakka maha jatara 2024 visit these places ,తెలంగాణ న్యూస్

0

Medaram Sammakka Sarakka Maha Jatara 2024: తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర ఇలా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండగా.. లక్షలాది మంది భక్తులు నాలుగు రోజులపాటు అక్కడే ఉండి తల్లులను దర్శించుకుంటుంటారు. కాగా మేడారం వెళ్లే భక్తులు సమ్మక్క, సారలమ్మ గద్దెలు, జాతర పరిసరాల్లో ఏర్పాటయ్యే దుకాణాలు తప్ప మిగతా వేటినీ పెద్దగా పట్టించుకోరు. అందుకే మేడారంలో జంపన్న గద్దె, నాగులమ్మ గద్దెలు ఉన్న విషయం కూడా చాలామందికి తెలీదు. ఇవే కాదు జాతరలో మూడు, నాలుగు రోజులు గడిపే భక్తులు కూడా సమ్మక్క, సారలమ్మ ఆలయాలను చూసి ఉండరు. మేడారం జాతర ప్రాంగణంలోనే ఉండే వీటిపై పెద్దగా ప్రచారం లేకపోవడం వల్లే భక్తులు జంపన్న, నాగులమ్మ గద్దెలు, సమ్మక్క, సారలమ్మ ఆలయాలు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోవడం లేదు. ఒకవేళ అటుగా వెళ్లిన సమయంలో వాటిని గమనించినా అవేంటో తెలియక చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. మరి జంపన్న, నాగులమ్మ గద్దెలు ఎక్కడున్నాయో.. సమ్మక్క, సారలమ్మ ఆలయాలను ఎక్కడ నిర్మించారో తెలుసుకుందామా..

Exit mobile version