Home తెలంగాణ అద్భుతమైన స్పీచ్ ఇవ్వండి రూ.2 లక్షలు గెలవండి-పార్లమెంట్ లో మాట్లాడే ఛాన్స్ కూడా!-medak news in...

అద్భుతమైన స్పీచ్ ఇవ్వండి రూ.2 లక్షలు గెలవండి-పార్లమెంట్ లో మాట్లాడే ఛాన్స్ కూడా!-medak news in telugu nehru yuva center national youth parliament utsav competition registrations open ,తెలంగాణ న్యూస్

0

National outh Parliament Utsav : నెహ్రూ యువ కేంద్రం.. జాతీయ యువజన పార్లమెంటు ఉత్సవాల్లో భాగంగా జాతీయ స్థాయి ఉపన్యాస పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలను కొన్ని జిల్లాల వారీగా విభజించింది. అందులో నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, ఉమ్మడి జిల్లాల కేంద్రాలకు కలిపి నెహ్రూ యువ కేంద్రం నిజామాబాద్ ఆన్లైన్ ద్వారా ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈ నెల 20న జరిగే పోటీల్లో గెలిచిన విజేతలు రాష్ట్రస్థాయికి, రాష్ట్రస్థాయిలో గెలిచినవారు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అవుతారు. జాతీయ స్థాయిలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రెండు లక్షల నగదు, రెండో బహుమతి రూ.1,50,000 ,మూడో బహుమతి రూ.లక్ష , ప్రోత్సాహక బహుమతులు ఇద్దరికి 50 వేల చొప్పున ఇస్తారు.

Exit mobile version