Home ఎంటర్టైన్మెంట్ రేటు పెంచిన హనుమాన్ హీరో తేజ సజ్జ !

రేటు పెంచిన హనుమాన్ హీరో తేజ సజ్జ !

0

ఒక్క సినిమా కేవలం ఒక్క సినిమా  బ్లాక్ బస్టర్ హిట్ పడితే చాలు ఇక ఆ సినిమాలో నటించిన ప్రధాన ఆర్టిసులకి కొన్ని సంవత్సరాల పాటు సినిమా రంగంలో  తిరుగుండదు. అదే హీరోకి అయితే ఇక చెప్పక్కర్లేదు. క్రేజ్ తో పాటు తన రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది. సినిమా రంగంలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా  ఆ  విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే సినిమాకి ఉన్న గొప్పతనం కూడా అదే. తాజాగా ఒక యువ హీరో తన రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేసాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

హనుమాన్ (hanuman) మూవీతో  హీరో తేజ సజ్జ ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. దీంతో తేజ తన రెమ్యునరేషన్ ని ఒక్కసారిగా పెంచినట్టు వార్తలు వస్తున్నాయి. హనుమాన్ సినిమాకి కోటి రూపాయల లోపే  పారితోషకాన్ని అందుకున్న తేజ హనుమాన్ హిట్ తో తనకి ఏర్పడిన గిరాకీ దృష్ట్యా ఇప్పుడు 8 నుంచి 10 కోట్లు దాకా డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు.ఆల్రెడీ కొంత మంది నిర్మాతలు  తేజ అడిగినంత ఇచ్చేందుకు సిద్దపడుతున్నారనే టాక్ కూడా వినపడుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తేజ రెమ్యునరేషన్ కి సంబంధించిన వార్తలు అయితే హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి

 తేజకి  సినిమాతో ఉన్న అనుబంధం మొన్న మొన్నటిది కాదు  రెండున్నర దశాబ్దాల క్రితమే బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించాడు. చిరంజీవి, మహేష్ బాబు లకి కొడుకుగా నటించి తన సత్తా చాటాడు. ఇక హనుమాన్ సినిమా ఇండియా వ్యాప్తంగా సృష్టిస్తున్న సంచలనం ఇప్పుడు అందరి కళ్ళ ముందు మెరుస్తున్న సత్యం. కొన్ని రోజుల క్రితమే 300 కోట్ల క్లబ్ లో హనుమాన్ కి  ఇంకా చాలా  ఏరియాల్లో కలెక్షన్స్ స్థిరంగానే ఉన్నాయి. భక్త వల్లభుడైన హనుమాన్ తన హనుమాన్ చిత్రం ద్వారా ఎంతో మందికి సినిమా రంగంలో అద్భుతమైన జర్నీ ని కొనసాగించే భాగ్యాన్ని దక్కించాడు.

 

Exit mobile version