అయితే బాక్సాఫీస్ తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది సలార్ మూవీ. జనవరి 20న నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సలార్ మూవీ రిలీజైంది. అంతేకాకుండా నెట్ ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీలో ఒకటిగా నిలిచాయి సలార్ తెలుగు, కన్నడ వెర్షన్ మూవీ. అయితే అన్ని భాషల్లో విడుదలైన సలార్ ఒక హిందీ భాషలో మాత్రం రిలీజ్ కాలేదు. దీంతో నార్త్ ప్రజలు సలార్ ఓటీటీ కోసం ఎదురుచూస్తూ వచ్చారు.