Home ఎంటర్టైన్మెంట్ విడాకులు తీసుకున్న మరో హీరోయిన్‌.. 12 ఏళ్ళ వివాహబంధానికి ఫుల్‌స్టాప్‌!

విడాకులు తీసుకున్న మరో హీరోయిన్‌.. 12 ఏళ్ళ వివాహబంధానికి ఫుల్‌స్టాప్‌!

0

ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు కాపురం చేసి విడిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఈ తరహా పెళ్ళిళ్లు, విడాకులు ఎక్కువయ్యాయనే చెప్పాలి. సౌత్‌ నుంచి నార్త్‌ వరకు ఉన్న సినీ పరిశ్రమల్లో ఇటీవలికాలంలో విడాకులు తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు. టాలీవుడ్‌లో సమంత, నిహారిక కొణిదెల తమ భర్తలతో విడిపోయారు. వీరి పెళ్లి, విడాకుల వ్యవహారం కూడా అప్పట్లో మీడియాలో సంచలనం సృష్టించింది. 

తాజాగా మరో హీరోయిన్‌ విడాకుల బాట పట్టింది. ధర్మేంద్ర, హేమమాలినిల కుమార్తె, బాలీవుడ్‌ హీరోయిన్‌ ఈషా డియోల్‌ తన భర్త భరత్‌ తఖ్తానీతో తెగతెంపులు చేసుకుంది. 12 సంవత్సరాల తమ వివాహ బంధానికి ముగింపు పలికినట్టు అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా ఈషా, భరత్‌ విడిపోతున్నారనే వార్తలు బాలీవుడ్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. హేమమాలిని 75వ పుట్టినరోజు వేడుకు భరత్‌ హాజరు కాకపోవడంతో ఈ జంట విడిపోతున్నారనే వార్త జోరందుకుంది. ఈమధ్య అవి మరింత ఉధృతం కావడంతో ఈషా డియోల్‌, భరత్‌ తఖ్తానీ ఇద్దరూ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని ఆ ప్రకటనలో తెలియజేశారు. అందరూ చెప్పినట్టుగానే ఇకపై తాము మంచి స్నేహితులుగా కొనసాగుతామని అన్నారు. ఈషా, భరత్‌ల వివాహం 2012లో ముంబైలోని ఇస్కాన్‌ ఆలయంలో ఎంతో నిరాడంబరంగా జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. రాధ్య, మిరయా. ఈషా డియోల్‌ ఒకే ఒక సౌత్‌ సినిమాలో నటించింది. దానిపేరు ‘యువ’. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సూర్యకు జోడీగా నటించింది ఈషా. 

Exit mobile version