తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడున్న అగ్ర హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. తన అధ్బుతమైన నటనతో తన అభిమానులతో పాటు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తు వస్తున్నాడు.ప్రస్తుతం చరణ్ గేమ్ చేంజర్ లో నటిస్తున్నాడు. తాజాగా ఒక బిగ్ హీరో రామ్ చరణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ అఫ్ ది తెలుగు సినిమాగా మారింది .
క్యారక్టర్ ఆర్టిస్టుగా చిరంజీవి మూవీ శంకర్ దాదా mbbs సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన నటుడు శర్వానంద్. ఆ తర్వాత ఎన్నో మంచి సినిమాల్లో నటిస్తు తన కంటు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తాజాగా శర్వానంద్ మంచు మనోజ్ టాక్ షో ఉస్తాద్ లో పాల్గొన్నాడు. ఈ షో లో శర్వానంద్ చరణ్ గురించి మాట్లాడుతు చరణ్ లాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం.ఒక రకంగా నా పూర్వ జన్మ పుణ్యం అని కూడా చెప్పాడు. చిరంజీవి గారు తన పక్కన ఉన్న వాళ్ళని ఎంత ప్రేమగా చేసుకుంటారో డిటో చరణ్ కూడా తన పక్కన ఉన్న వాళ్ళని అంతే ప్రేమగా చూసుకుంటాడు.
చరణ్ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని గర్వంగా చెప్పగలను. అలాంటి ఫ్రెండ్ ని స్నేహితుడుగా ఇచ్చినందుకు ఆ దేవుడికి ఎప్పుడు థాంక్స్ చెప్తుంటాను అని కూడా శర్వానంద్ చెప్పుకొచ్చాడు.ఇక శర్వానంద్, రామ్ చరణ్ ఇద్దరు కూడా చిన్నపటినుంచి మంచి స్నేహితులు. ఈ విషయం చాలా మందికి తెలుసు. అలాగే చిరంజీవి కూడా చాలా సందర్భాల్లో శర్వానంద్ చిన్నపటినుంచి మా ఇంట్లోనే పెరిగాడని చెప్పాడు. ప్రస్తుతం చరణ్ గురించి శర్వానంద్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.