Home తెలంగాణ Medaram Jatara 2024 : మేడారం భక్తులకు గుడ్ న్యూస్

Medaram Jatara 2024 : మేడారం భక్తులకు గుడ్ న్యూస్

0

ఆన్​ లైన్​ పేమెంట్ చేస్తే చాలు

మేడారం వరకు వెళ్లలేని భక్తులు ఇంటి నుంచే మొక్కులు చెల్లించుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోంది. ఈ మేరకు ఆన్​ లైన్​ లో పేమెంట్​ చేస్తే సమ్మక్క–సారలమ్మ(Medaram Sammakka Sarakka) గద్దెల వద్దకు ఎత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయం తీసుకొచ్చింది. కిలో ఎత్తు బంగారానికి రూ.60 చొప్పున చెల్లిస్తే ప్రభుత్వమే సంబంధిత వ్యక్తుల పేరున బెల్లాన్ని సమ్మక్క గద్దెలకు చేరుస్తుంది. ఎత్తు బంగారానికి అయ్యే ఛార్జీలతో పాటు పోస్టల్​ ఛార్జీలు కూడా చెల్లిస్తే కొంత బెల్లాన్ని ప్రసాదం రూపంలో ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఆన్​ లైన్​ సేవల కింద రూ.35 ఛార్జీలతో పాటు ప్రసాదం ఇంటికి పంపించేందుకు పోస్టల్​ ఛార్జీల కింద మరో రూ.100 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎత్తు బంగారం సమర్పించాలనుకునే భక్తుడు 50 కిలోల బరువున్నారనుకుందాం. ఆయన 50 కిలోల ఎత్తు బంగారం సమర్పించడానికి కిలోకు రూ.60 చొప్పున రూ.3 వేలు, ఫీజు కింద రూ.35, ప్రసాదం ఇంటికి పంపించేందుకు మరో రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా రూ.3,135 చెల్లిస్తే.. బెల్లాన్ని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద సమర్పించి, కొంత బంగారాన్ని మన ఇంటికి చేరుస్తారన్నమాట.

Exit mobile version