తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడు నెలల్లో కూలిపోతుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంట్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ స్పందించారు. అసలు విజయసాయి రెడ్డి ఈ ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మోదీకి ఏమైనా విజయసాయి తొత్తా అని అడిగారు. మెుదట ఏపీ పరిస్థితి గురించి విజయసాయి చూసుకోవాలని హితువు పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వైసీపీ నెరవెర్చింందా, ఏపీ రాజధాని గురించి పార్లమెంట్ లో మాట్లాడాలని సూచించారు.