Home ఎంటర్టైన్మెంట్ రవితేజ ఈగిల్ మొట్టమొదటి రివ్యూ

రవితేజ ఈగిల్ మొట్టమొదటి రివ్యూ

0

మాస్ మహారాజ రవితేజ నుంచి వస్తున్న నయా మూవీ ఈగిల్. గత చిత్రం టైగర్ నాగేశ్వరరావు ఆశించినంత విజయం సాధించకపోవడంతో రవితేజ తో పాటు ఆయన అభిమానులందరు ఈగిల్ పై భారీ ఆశలే పెట్టుకున్నారు. మూవీలోని రవి తేజ గెటప్ తో పాటు ట్రైలర్ కూడా అదిరిపోవడంతో ఈగిల్ కోసం అందరు  ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 9 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వడం కోసం ముస్తాబవుతున్న ఈగిల్ కి సంబందించిన ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

   .

రవితేజ లేటెస్ట్ గా ప్రేక్షకుడు హోదాలో  ఈగిల్ స్పెషల్ ప్రివ్యూ ని వేసుకొని చూడడం జరిగింది. అనంతరం మూవీ చాలా బాగా వచ్చిందని రిజల్ట్ విషయంలో సూపర్ సాటిస్ఫైడ్ గా ఉన్నానని కూడా చెప్పాడు.సో రవి తేజ తన సినిమాకి తానే  మొదటి ప్రేక్షకుడుగా మారి  ఫస్ట్ రివ్యూని  అందించాడు. ఇప్పుడు రవితేజ ఈగిల్ కి ఇచ్చిన రివ్యూ వార్తలు విషయం   సోషల్ మీడియాలో వస్తుండటంతో రవితేజ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అలాగే మూవీ పక్కా హిట్ అని కూడా అంటున్నారు. మరి రవితేజ రివ్యూ నే రేపు ఈగిల్ రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు చెప్తారేమో చూడాలి.

కొన్ని రోజుల నుంచి ఈగిల్ ప్రమోషన్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రవితేజ అభిమానుల సమక్షం లో చాలా  ఘనంగా జరిగింది. రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ లు జతకట్టగా . పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వక్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈగిల్ కి కార్తీక్ ఘట్టమనేని  దర్శకుడు.

 

Exit mobile version