Home బిజినెస్ ఇండస్ఇండ్ బ్యాంక్ లో వాటాల కొనుగోలుకు హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ కు ఆర్బీఐ...

ఇండస్ఇండ్ బ్యాంక్ లో వాటాల కొనుగోలుకు హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ కు ఆర్బీఐ ఆమోదం; ఓటింగ్ రైట్స్ కు అవకాశం-rbi approves hdfc banks proposal to acquire 9 5 percent in indusind bank explained ,బిజినెస్ న్యూస్

0

HDFC Bank: ఓటింగ్ హక్కులు కూడా లభించేలా ఇండస్ఇండ్ బ్యాంక్ లో 9.5 శాతం వరకు వాటాలు కొనుగోలు చేయాలనుకుంటున్నామన్న హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ లిమిటెడ్ చేసిన దరఖాస్తును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా () ఆమోదించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్, 1949, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, 1999లోని నిబంధనలు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా ఆర్బీఐ ఆమోదం ఉంటుంది. మరియు వర్తించే ఏవైనా ఇతర శాసనాలు, నిబంధనలు మరియు మార్గదర్శకాలు ఉన్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 5, 2024 నుండి ఏడాదిలోగా హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ ఈ ప్రధాన వాటాను కొనుగోలు చేయాల్సి ఉందని ఆర్బీఐ తెలిపింది. ఆ గడువులోపు వాటాల కొనుగోలులో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ విఫలమైతే ఆర్బీఐ ఇచ్చిన అనుమతి ఆటోమెటిక్ గా రద్దవుతుంది.

Exit mobile version