ఏపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసే పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్న సందర్భంలో సీఎం వైఎస్ జగన్‌పై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సిద్ధం సిద్ధం అని రాష్ట్రమంతా పోస్టర్లు ఎందుకు వేశారని ప్రశ్నించారు. సొంత చెల్లెలు షర్మిలపై వైసీపీ శ్రేణులు నీచంగా మాట్లాడుతుంటే జగన్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి మహిళలకు ఏం గౌరవం ఇస్తాడని పవన్ కళ్యాణ్ ప్రశించారు.