Home ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉద్యోగులు, సమస్యలపై స్పందించకపోతే సమ్మె బాట- బండి శ్రీనివాసరావు-amaravati news...

ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉద్యోగులు, సమస్యలపై స్పందించకపోతే సమ్మె బాట- బండి శ్రీనివాసరావు-amaravati news in telugu ap jac leader bandi srinivasa rao says govt employees not happy with ysrcp govt ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

పోలీసులకు సరెండర్ లీవులు చెల్లించలేదు

రేయింబవళ్లు కష్టపడే పోలీసులకు రెండు సంవత్సరాలుగా కనీసం సరెండర్ లీవులు కూడా చెల్లించడం లేదని, ప్రస్తుత పరిస్థితులు ఉద్యోగులు అర్థం చేసుకుని, ఓపికతో, సహనంతో, నమ్మకంతో చెల్లింపుల కోసం వేచి చూస్తున్నారని వారికి ఇవ్వాల్సిన ఆర్ధిక ప్రయోజనాల విషయంలో మాత్రం ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఆర్ధిక సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలకు రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, పూర్తి స్థాయిలో అమలుకాని ఎంప్లాయిస్ హెల్త్ స్కీంతో పెన్షనర్లు/ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగసంఘాలు గత 2022 ఫిబ్రవరి లో ఉద్యమించినపుడు ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ ఉన్నతాధికార్లు సమక్షంలో అంగీకరించిన సమస్యల పరిష్కారంలో కూడా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.

Exit mobile version