మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు వ్యాపారపరంగా అభివృద్ధి చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యా, సినీ, కళారంగాలలోని వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. అనుకూలమైన మార్పులో చోటు చేసుకుంటాయి. తలపెట్టిన పనులను నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. సహోదరీ వర్గంతో విభేదాలు ఏర్పడవచ్చు. వృత్తి ఉద్యోగాలలో ఆధిపత్యం కోసం శ్రమిస్తారు. జీవితాన్ని కొత్త కోణంలో చూస్తారు. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.