Home తెలంగాణ బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసు, ఏపీలో పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు అరెస్ట్!-hyderabad crime...

బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి కేసు, ఏపీలో పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు అరెస్ట్!-hyderabad crime news in telugu punjagutta former ci durgarao arrested in anantapur ,తెలంగాణ న్యూస్

0

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మొత్తం బదిలీ

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని హోంగార్డుల నుంచి ఇన్స్పెక్టర్ వరకు అందర్నీ బదిలీ చేశారు. ఇందులో కొంతమందిని ఏఆర్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు కేసు విషయంలో స్టేషన్ సిబ్బంది చేసిన నిర్వాకం వల్ల అతను దేశం విడిచి వెళ్లడంతో పాటు ఇటీవల ఓ హోటల్ గొడవ విషయంలో కూడా స్టేషన్ సిబ్బంది చేసిన నిర్లక్ష్యంతో ఒక వ్యక్తి మృతిచెందడంతో పెద్ద ఎత్తున అక్కడ సిబ్బందిపై విమర్శలు వచ్చాయి. దీంతో సీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా ప్రజా భవన్ పంజాగుట్ట పరిధిలో ఉండడంతో అక్కడికి వచ్చే బాధితుల వివరాలు కూడా మాజీ ప్రభుత్వ నేతలకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా దేశ చరిత్రలోనే ఒకే ఆర్డర్ కాపీ తో స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేయడం ఇదే మొదటిసారి.

Exit mobile version