Yashasvi Jaiswal: ఇంగ్లండ్‍తో రెండో రెండో టెస్టులో భారత్ భారీ విజయం సాధించింది. విశాఖపట్టణంలో జరిగిన ఈ మ్యాచ్‍లో నేడు (జనవరి 5) టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లిష్ జట్టుపై గెలిచింది. అయితే, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (209 పరుగులు) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. భారత గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తన ఆరో టెస్టులోనే ద్విశతకంతో దుమ్మురేపాడు. డబుల్ సెంచరీ చేశాక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో తాను మాట్లాడానని యశస్వి జైస్వాల్ నేడు వెల్లడించాడు.