Home తెలంగాణ ఇల్లెందు మున్సిపాలిటీలో హైడ్రామా-వీగిపోయిన అవిశ్వాసం, ఎమ్మెల్యేతో సహా 17 మందిపై కేసు-yellandu news in telugu...

ఇల్లెందు మున్సిపాలిటీలో హైడ్రామా-వీగిపోయిన అవిశ్వాసం, ఎమ్మెల్యేతో సహా 17 మందిపై కేసు-yellandu news in telugu no confidence motion in municipality failed brs complaint on mla kanakaiah ,తెలంగాణ న్యూస్

0

అవిశ్వాసంలో హైడ్రామా

మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ నుంచి 19 మంది కౌన్సిలర్లు, ముగ్గురు ఇండిపెండెంట్లు, న్యూడెమొక్రసీ, సీపీఐ నుంచి ఒక్కొక్క కౌన్సిలర్ గెలుపొందారు. ఇందులో కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అవిశ్వాసం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేసింది. పార్టీ నుంచి వెళ్లిపోయిన ఛైర్మన్ ను గద్దెదించేందుకు బీఆర్ఎస్ నేతలు పక్కా ప్లాన్ చేసుకున్నారు. ఛైర్మన్ పై పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే ఒక్కో కౌన్సిలర్ కు దాదాపు రూ.25 లక్షల వరకు ఆఫర్ ఇస్తున్నట్టుగా ప్రచారం కూడా జరిగింది. ఇక కాంగ్రెస్ లో చేరిన ఛైర్మన్ డి. వెంకటేశ్వరరావు పదవిని కాపాడేందుకు అధికార పార్టీ ముఖ్య నాయకత్వం పక్కా ప్రణాళిక రచించినట్లు స్పష్టం అవుతోంది. అవిశ్వాసానికి మద్దతు తెలిపిన 17 మంది కౌన్సిలర్లు గత వారం రోజులుగా గోవా, కర్నాటక రాష్ట్రాల్లో క్యాంపుల్లో గడిపారు. అవిశ్వాసం సందర్భంగా నిర్వహించనున్న స్పెషల్ మీటింగ్ కు కనీసం 17 మంది కౌన్సిలర్లు అటెండ్ కావాల్సి ఉండగా హై డ్రామా నెలకొంది.

Exit mobile version