Home తెలంగాణ BRS Harish Rao : రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష

BRS Harish Rao : రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష

0

కేసీఆర్ పెట్టిన భిక్ష – హరీశ్ రావు

“రేవంత్ రెడ్డికి సీఎం పదవి, కేసీఆర్ పెట్టిన భిక్ష. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది, ఆయనకు నేడు సీఎం పదవి వచ్చింది. ఒక సీఎం అసభ్యంగా, అసహ్యంగా, అనాగరికంగా మాట్లాడుతున్నారు. దేశంలోనే ఇంత అనాగరిక, సంస్కార రహిత, అనాగరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ నీతి మాటలు మాట్లాడటం తర్వాత, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీతి చెప్పు. ఈ రాష్ట్ర పరువు, మీ కాంగ్రెస్ పరువు తీసే విధంగా మాట్లాడుతున్నాడు. మార్పు తెస్తా అని, అభాగ్యులు, అన్నర్ధులు, పేదలకు నెల నెలా పింఛన్లు ఇవ్వలేని ప్రభుత్వం గెలిస్తే 4000 అన్నారు. పింఛన్లు మాత్రం పెరగలేదు. పాతవి ఇవ్వలేదు. ఈ జిల్లా మంత్రి గారు ఆర్థిక మంత్రి. వాళ్లకు పింఛన్లు ఇవ్వక పోవడమే మీ ప్రాధాన్యమా….? పింఛన్లు ఇవ్వకపోవడమే మార్పా..? కరెంటు కోతలు పెట్టడమే మార్పా? 6 లక్షల మంది ఆటో సోదరులను రోడ్డున పడేయడమే మార్పా? రైతు బంధు ఫిబ్రవరి దాకా పడక పోవడం మార్పా?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.

Exit mobile version