Home తెలంగాణ భారత్ లో క్యాన్సర్ కలవరం, 2026 నాటికి ఏటా 20 లక్షల మరణాలు!-khammam news in...

భారత్ లో క్యాన్సర్ కలవరం, 2026 నాటికి ఏటా 20 లక్షల మరణాలు!-khammam news in telugu world cancer day aiims report says 20 lakh cancer deaths in india ,తెలంగాణ న్యూస్

0

కణజాలం విపరీతంగా పెరగడమే..

శరీరం మొత్తం కణజాలంతో నిండి ఉంటుంది. శరీరంలో ఎక్కడైనా కణజాలం అవసరం లేకుండా విపరీతంగా పెరిగిపోవడమే క్యాన్సర్‌ అని క్యాన్సర్‌ వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శరీరంలో కణాల విభజన జరుగుతుంది. ఇలా ప్రతి కణం విభజనకు గురై పుడుతూ చనిపోతూ ఉంటాయి. అయితే శరీరంలో ఈ ప్రక్రియకు విఘాతం ఏర్పడితే కొన్ని కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. కణాల్లో ఉండే డీఎన్‌ఏలో మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఆహారపు అలవాట్లు, రేడియేషన్‌, స్మోకింగ్‌, ఊబకాయం తదితర కారణాల వల్ల కూడా డీఎన్‌ఏలో మార్పులు వస్తాయి. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ (రొమ్ములు), స్కిన్‌ క్యాన్సర్‌ (చర్మం), లంగ్‌ క్యాన్సర్‌ (ఊపిరితిత్తులు), ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ (మూత్రాశయం), కొలోన్‌ లేదా రెక్టం క్యాన్సర్‌ (పెద్ద పేగు భాగం), కిడ్నీ క్యాన్సర్‌ (మూత్రపిండాలు), బ్లడ్‌ క్యాన్సర్‌ (రక్తం), సర్వైకల్‌ క్యాన్సర్‌ వంటివి ముఖ్యమైనవని వైద్యులు చెబుతున్నారు.

Exit mobile version