Home రాశి ఫలాలు వార ఫలాలు.. ఈ రాశుల జాతకులు ఖర్చులు తగ్గించుకుంటే మంచిది

వార ఫలాలు.. ఈ రాశుల జాతకులు ఖర్చులు తగ్గించుకుంటే మంచిది

0

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగపరంగా మధ్యస్థ ఫలితాలున్నాయి. ఖర్చులు ఆదాయాన్ని మించుతాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన బాధ్యతలు ఉత్సాహపరచగలవు. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసిరావచ్చును. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మేష రాశి వారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుడిని పూజించినట్లయితే మరింత శుభఫలితాలు కలుగుతాయి.

Exit mobile version