కాంగ్రెస్ జాగ్రత్తగా ఉండాలి – బండి సంజయ్
“బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే గుడ్డి ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. దీన్ని ప్రజలు ఎవరూ నమ్మటం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా పైన బీజేపీ రావాలి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను ఇచ్చింది. ఇప్పటి వరకు రైతుబంధు కూడా ఇవ్వలేదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడ బీజేపీ గెలవాలని కోరుకోవాలి. దేశం కోసం మోదీ ఉండాలి. ఇదే ప్రజల ఆలోచనగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ పార్టీకి సూచిస్తున్నాను. ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉంటుంది” అంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.