Jogulamba-Gadwal District News : జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై అదుపుతప్పి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. మంటల్లో చిక్కుకుని మరో పది మంది గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని కారణాలు తెలియాల్సి ఉంది.