Home చిత్రాలు కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

0

ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తాను టీడీపీలోకి పోతున్నానని అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

తాను ఎవరినీ కలవలేదన్న మహీధర్ రెడ్డి ఆ అవసరం కూడా తనకు లేదని చెప్పారు.టికెట్ నిరాకరిస్తే విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

తాను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలో చేరనని తేల్చి చెప్పారు.ప్రతిపక్షాలను తిట్టమని వైసీపీ అధిష్టానం పెద్దలు తనకు చెప్పలేదని తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించారు.కందుకూరు టికెట్ బీసీలకు ఇస్తే పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.

Exit mobile version