త్వరలోనే ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ కార్పొరేషన్ కు రిజిస్ట్రేషన్లు, స్టాంపులు,వాణిజ్య పన్నులతో పాటు ఇతర శాఖల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని మళ్లించాలని చూస్తోంది. ఫలితంగా ప్రతి నెలా… ఈఎంఐ పద్ధతిలో బ్యాంకులకు డబ్బులను చెల్లించవచ్చని లెక్కలు వేస్తోంది ప్రభుత్వం. ఇక ఇదే రుణమాఫీకి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ కూడా కనిపించింది. రాష్ట్రంలో ఉన్న 32 వేల కోట్ల రైతురుణాలను ప్రభుత్వం మాఫీ చేయబోతుందని… ఇందుకోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు కాబోతుంది తెలిపింది.