Home తెలంగాణ భోగి మంట విశిష్టత ఏంటి? ఆ మంటల్లో ఏం వేయకూడదు?-khammam news in telugu bhogi...

భోగి మంట విశిష్టత ఏంటి? ఆ మంటల్లో ఏం వేయకూడదు?-khammam news in telugu bhogi bonfire importance which do not throw in fire ,తెలంగాణ న్యూస్

0

మంటల్లో ఏం వేయాలంటే..

ఇక భోగిమంటల్లో వేసే వస్తువుల గురించి కూడా కాస్త జాగ్రత్త వహించాలి. ఒకప్పుడు భోగి మంటల్లో చెట్టు బెరడులు, పాత కలప వేసేవారు. ధనుర్మాసమంతా ఇంటి ముందర పెట్టుకున్న గొబ్బిళ్లను, పిడకలుగా చేసి భోగి మంటల కోసం ఉపయోగించేవారు. ఇవి బాగా మండేందుకు కాస్త ఆవు నెయ్యిని జోడించేవారు. ఇలా పిడకలు, ఆవు నెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. కానీ కాలం మారింది. రబ్బర్‌ టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్‌ కుర్చీలని కూడా భోగి మంటల్లో వేస్తున్నారు. వాటిని భగభగా మండించేందుకు పెట్రోలు, కిరసనాయిల్ వంటి ఇంధనాలని వాడేస్తున్నారు. ఇలాంటి భోగి మంటల వల్ల వెచ్చదనం మాటేమో గానీ, ఊపిరితిత్తులు పాడవడం ఖాయమంటున్నారు. పైగా రబ్బర్‌, ప్లాస్టిక్, పెట్రోల్, కిరసనాయిల్‌ వంటి పదార్థాల నుంచి వెలువడే పొగతో అటు పర్యావరణమూ కలుషితం కావడం ఖాయం. మన పూర్వీకులలాగా పిడకలు, చెట్టు బెరడులు, ఆవు నెయ్యి ఉపయోగించి భోగి మంటలు వేయలేకపోవచ్చు. కనీసం తాటి ఆకులు, పాత కలప, ఎండిన కొమ్మలు వంటి సహజమైన పదార్థాలతో భోగి మంటలు వేసుకోవాలన్నది పెద్దల మాట. అలా నలుగురికీ వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్నీ అందించే భోగి మంటలు వేసుకోవాలా? లేకపోతే నాలుగు కాలాల పాటు చేటు చేసే మంటలు వేసి సంప్రదాయాన్ని ‘మంట’ కలపాలా..? అన్నది మనమే నిర్ణయించుకోవాలి.

Exit mobile version