తెలంగాణ RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించటంతో రద్దీ బాగా పెరిగింది. పలుచోట్ల ఆడాళ్లు సీట్ల కోసం గొడవ పడుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో సీటు కోసం మహిళలు కొట్లాడుకున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. నిజామాబాద్ నుంచి భైంసా వస్తున్న ఆర్టీసీ బస్సు గురువారం మధ్యాహ్నం ముథోల్ కు చేరుకుంది. కొన్ని సీట్లు ఖాళీ కాగా అప్పటికే రెండు బస్సులు చెడిపోవడంతో అందులోని ప్రయాణికులు ఈ బస్సుకి ఎక్కారు.ముథోల్లో ఎక్కిన కొందరు మహిళలు సీటు ఆపగా అప్పటికే బస్సులోని మహిళలకు..వీరికి ఆ సీటు కోసం కొట్లాట జరిగింది. కండక్టర్ చెబుతున్నప్పటికీ మహిళలు వినిపించుకోలేదు.