Swami vivekananda: స్వామి వివేకానంద ఎంతో మంది యువతకు స్ఫూర్తి. ఆధునిక భారతావనిలో యువతలో ఉండాల్సిన లక్షణాలను చెప్పిన మొదటి వ్యక్తి ఆయన. నరేంద్రనాథ్ దత్తాగా జన్మించిన తరువాత వివేకానందగా పేరు మార్చుకున్నారు. 1863 జనవరి 12న కోల్ కతాలో జన్మించారు. అతని తండ్రి విశ్వనాధ్ దత్త. కలకత్తా హైకోర్టు న్యాయవాదిగా ఉండేవారు. తల్లి భువనేశ్వరి దేవి. ఆధ్యాత్మికవేత్తగా కొనసాగారు. స్వామి వివేకానందకు చదువంటే ఎంతో ఇష్టం. ఈయన రామకృష్ణ పరమహంసతో పరిచయం అయ్యాక సర్వస్వం వదిలి కేవలం పాతికేళ్ల వయసులోనే సన్యాసిగా మారారు. అప్పటినుంచి స్ఫూర్తివంతమైన ప్రసంగాలు చేస్తూ యువతను ముందుకు నడిపించారు. ఆయన మాటల్లో ఎన్నో స్ఫూర్తి మంత్రాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పటికీ యువతలో విజయాన్ని సాధించాలన్న కాంక్షను రగిలిస్తాయి.