Home తెలంగాణ Telangana Govt : టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ

Telangana Govt : టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ

0

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఖాళీగా ఉన్న చైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అర్హులైన వారు జనవరి 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. www.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సర్కార్ సూచించింది. పూర్తి చేసిన దరఖాస్తులను 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు secy-ser-gad@telangana.gov.in మెయిల్‌కు పంపాలని తెలిపింది. అర్హతలకు సంబంధించిన వివరాలను కూడా నోటిఫికేషన్ లో వివరించింది.

Exit mobile version