20 నిమిషాల్లోనే..
ఈ అటల్ సేతు (Atal Setu) 21.8 కిమీ పొడవైన ఆరు లేన్ల వంతెన. ఇది సముద్రంపై 16.5 కి.మీ, భూమిపై 5.3 కి.మీ. ఉంటుంది. ముంబయిలోని సెవ్రీని రాయ్‌గఢ్‌లోని చిర్లేతో ఈ వంతెన కలుపుతుంది. గతంలో ఈ దూరం ప్రయాణించడానికి గంటకు పైగా సమయం పట్టేది. ఇప్పుడు ఈ వంతెన పై నుంచి ముంబయిలోని సెవ్రీ నుంచి రాయ్‌గఢ్‌లోని చిర్లేకు వెల్లడానికి కేవలం 20 నిమిషాల సమయం పడుతుంది. అటల్ సేతుతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ – ముంబై, థానే, పాల్ఘర్, రాయ్‌గడ్‌ల కనెక్టివిటీ పెరుగుతుంది.