సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మకర సంక్రాంతి అని అంటారు. ఈ సమయంలో తన కుమారుడు అయిన శని భగవానుడి ఇంటికి వస్తాడని చెబుతుంటారు. భారతదేశంలో సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తారు. ఒక్కో ప్రాంతంలో సంక్రాంతి ఒక్కో విధంగా నిర్వహిస్తారు. దక్షిణ భారతదేశంలో అయితే సంక్రాంతి అంటే పంట చేతికి వచ్చే సమయం. ఈ సమయంలో పశువులను అందంగా అలంకరిస్తారు. ఇంటి ముందు కల్లాపి చల్లి.. గొబ్బెమ్మలు పెడతారు. రంగులతో ముగ్గులు వేస్తారు.