Ganza Business: గాడిదల పెంపకం మాటున గంజాయి విక్రయిస్తోన్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 130 కిలోల గంజాయి, రెండు కార్లు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ అడిషనల్ డిసిపి మధుసూదన్ రావు,బేగంపేట ఏసిపీ రామలింగరాజు తో కలిసి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.