చంద్రబాబు, లోకేష్ మాట్లాడే అసభ్య పదజాలంపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. మంగళవారం CEC రాజీవ్ కుమార్ బృందంతో ఎంపీలు విజయసాయి రెడ్డి, మార్గాని భరత్ విజయవాడలో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. గుర్తింపు లేని జనసేనను ఈ సమావేశానికి ఎందుకు ఆహ్వానించారని తాము సీఈసీని అడిగినట్టుగా చెప్పారు.