ఇవే పారామీటర్స్
దేశంలో న్యాయ విద్య(Law) కు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. న్యాయ విభాగంలో వృత్తి, ఉద్యోగ అవకాశాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. కార్పొరేట్ సంస్థల్లో కూడా లా గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) భారత్ లో న్యాయ విద్యను బోధించే అత్యున్నత 10 విద్యా సంస్థల జాబితాను వెలువరించింది. టీచింగ్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్ (TLR), రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ (RPC), ఔట్ రీచ్ అండ్ ఇన్ క్లూజివిటీ (OI), గ్రాడ్యుయేషన్ ఔట్ కమ్ (GO), పర్సెప్షన్ (PERCEPTION).. వంటి బహుళ పారామీటర్లను ప్రాతిపదికగా తీసుకుని ఈ ర్యాంకింగ్స్ ను ఇచ్చారు.