అన్నింటికన్నా మించి ఆల్కహాల్ కు దూరంగా ఉండటం వల్ల మీకు మానసిక స్పష్టత వస్తుంది. మీరు ఏం చేస్తున్నారో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో అన్న విషయాలు మీ మెదడు చక్కగా ఆలోచిస్తుంది. మీ భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. డిప్రెషన్, మానసిక ఆందోళన, యాంగ్జైటీ వంటి వాటికీ దూరంగా ఉంటారు. ఈ నెల రోజులు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పనితీరు మెరుగు పడుతుంది. నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు. మీపై మీకు శ్రద్ధ పెరుగుతుంది.