Home రాశి ఫలాలు 7 వేల కిలోల రామ్ హల్వా.. 108 అడుగుల అగర్ బత్తి.. అయోధ్య రామాలయంలో ఎన్నో...

7 వేల కిలోల రామ్ హల్వా.. 108 అడుగుల అగర్ బత్తి.. అయోధ్య రామాలయంలో ఎన్నో అద్భుతాలు-ayodhya ram mandir received gifts included largest agarbatti and prepare special halwa for devotees ,రాశి ఫలాలు న్యూస్

0

భారీ అగర్ బత్తి

రాముని బాల విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా 108 అడుగుల పొడవైన అగర్ బత్తిని వెలిగించనున్నారు. గుజరాత్ నుంచి ఉత్తర ప్రదేశ్ కి పొడవైన ట్రక్ లో దీన్ని తరలిస్తున్నారు. ప్రతిష్ఠాపనలోపు ఈ భారీ ధూపం స్టిక్ కూడా అయోధ్య చేరుకోబోతుంది. గుజరాత్ లోని వడోదర కి చెందిన గోపాలక విహాభాయ్ బర్వాద్ దీన్ని తయారు చేశారు. దీని తయారీలో 374 కిలోల గూగల్, 280 కిలోల బార్లీ, 191 కిలోల ఆవు నెయ్యి, 108 కిలోల సుగంధ ద్రవ్యాలు, హవన్ మెటీరియల్ 475 కిలోలు, 572 కిలోల గులాబీ పువ్వులు, 1475 కిలోల ఆవు పేడ ఉపయోగించారు. దీని బరువు 3,657 కిలోలు. పొడవు 108 అడుగులు, వెడల్పు 3.5 అడుగులు. దీన్ని తయారు చేయడానికి ఆరు నెలల సమయం పట్టింది. రూ.5.5 లక్షలు వ్యయంతో దీన్ని రూపొందించారు. దాదాపు 41 రోజుల పాటు మండుతూనే ఉంటుంది. జనవరి 13 న అయోధ్యకి చేరుకుంటుంది.

Exit mobile version