Home తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు పెట్టండి- అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్-siddipet...

10వ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు పెట్టండి- అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్-siddipet news in telugu additional collector ordered teachers conduct extra classes to ssc students ,తెలంగాణ న్యూస్

0

Siddipet News : బోర్డు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న సమయంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే వార్షిక పరీక్షలు ముగిసే వరకు ఏ ఒక్క ఉపాధ్యాయుడు సెలవు తీసుకోకుండా పనిచేయాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ కోరారు. ప్రతి జిల్లా విద్యాధికారి మొదలు మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అలాగే కిందిస్థాయి సిబ్బంది ఉపాధ్యాయులు సైతం వార్షిక పరీక్షలు ముగిసే వరకు ప్రతినెల వారీగా టూర్ డైరీని తయారు చేసుకుని తమ సంతకంతో తనకు నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పాఠశాలలో 5+1 అనే సూత్ర ప్రాయంగా ఉపాధ్యాయుడు బోధన చేయాలన్నారు. 5 రోజులు కోచింగ్ 1 రోజు అసెస్మెంట్ చెయ్యాలని అదనపు కలెక్టర్ సూచించారు.

Exit mobile version