Kodali Nani : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న కేశినేని నానిని పక్కనబెట్టి, రూ.100 కోట్లు ఇస్తానన్న వారికి సీటు ఇస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు కూడా అమ్ముకున్నారన్నారు. వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుపై స్పందిస్తూ… ఎవరు ఎక్కడ పోటీ చెయ్యాలో సీఎం జగన్ చెబుతారన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి సీటు మార్పు ఊహాగానాలే అన్నారు.