Home తెలంగాణ తెలంగాణలో లోక్ సభ స్థానాలకు బీజేపీ ఇన్ ఛార్జ్ ల నియామకం-hyderabad news in telugu...

తెలంగాణలో లోక్ సభ స్థానాలకు బీజేపీ ఇన్ ఛార్జ్ ల నియామకం-hyderabad news in telugu ts bjp lok sabha incharge appointed ,తెలంగాణ న్యూస్

0

బీజేపీ ఇన్ ఛార్జ్ లు

  • ఆదిలాబాద్ – పాయల్‌ శంకర్, ఎమ్మెల్యే
  • పెద్దపల్లి – పవార్ రామారావు పటేల్, ఎమ్మెల్యే
  • కరీంనగర్ – ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్యే
  • నిజామాబాద్ – ఏలేటి మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే
  • జహీరాబాద్ – కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే
  • మెదక్ – పాల్వాయి హరీశ్‌ బాబు, ఎమ్మెల్యే
  • మల్కాజిగిరి – పైడి రాకేశ్‌ రెడ్డి, ఎమ్మె్ల్యే
  • సికింద్రాబాద్ – కె.లక్ష్మణ్, ఎంపీ
  • హైదరాబాద్ – రాజాసింగ్, ఎమ్మెల్యే
  • చేవెళ్ల – ఏ వెంకట నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ
  • మహబూబ్‌నగర్ – రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ
  • నాగర్‌ కర్నూల్ – మాగం రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
  • నల్లగొండ – చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే
  • భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే
  • వరంగల్ – మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ మంత్రి
  • మహబూబాబాద్ – గరికపాటి మోహనరావు, మాజీ ఎంపీ
  • ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ

లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం

నాంపల్లి బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం మొదలైంది. బీజేపీ నేతలు బన్సల్, తరుణ్ చుగ్, బండి‌ సంజయ్, డీకే అరుణ, లక్ష్మణ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, చాడా సురేష్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థులు, అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎంపికపై కూడా చర్చించనున్నారు. దీంతో పాటు ముఖ్య నేతల మధ్య గ్యాప్‌పై బీజేపీ అగ్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నేతల మధ్య సమన్వయం బాధ్యతను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అప్పగించింది. కనీసం 10 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇదే సత్తా లోక్ సభ ఎన్నికల్లో కూడా చూపాలని నేతలు భావిస్తున్నారు.

Exit mobile version