AP TS Congress Coordinators : సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం సన్నద్ధమవుతోంది. దేశంలోని 28 రాష్ట్రాల్లోని పార్లమెంట్ స్థానాలకు ఏఐసీసీ సమన్వయ కర్తలను నియమించింది. ఏపీలోని 25 , తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మహబూబ్‌నగర్, చేవెళ్ల నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్ సభ స్థానాల బాధ్యతను అప్పగించింది. టీపీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్‌రెడ్డిని ఏఐసీసీ నియమించింది.