Afghanistan Cricketers అప్ఘనిస్థాన్ క్రికెటర్లు నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రహమాన్‌తో పాటు ఫజల్ హక్ ఫరూఖీలకు ఆ దేశ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. ఐపీఎల్‌తో పాటు విదేశీ లీగ్‌లలో ఆడకుండా వారిపై నిషేధం వించినట్లు సమాచారం. విదేశీ లీగ్‌లలో ఆడటానికి వారికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అప్ఘన్ క్రికెట్ బోర్డు నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు క్రికెటర్లు ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తోన్నాయి.