ప్రజల నుంచి తీసుకునే లంచాలపై సత్యనాయి జిల్లా మడకశిర తహసీల్దార్ ముర్దావలి చేసిన వ్యాఖ్యలు వైరల్ కావటంతో ఆయన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ వ్యక్తి నుంచి ఎమ్మార్వో లంచం డిమాండ్ చేస్తూ, వారు పెట్టే ఖర్చులపై చెప్పుకొచ్చారు. మంత్రులు, ఉన్నతాధికారులు తమ ప్రాంతాల పర్యటనకు వచ్చినపుడు ఏర్పాట్లకు డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చిన లంచాల నుంచే వాటికి ఖర్చు చేస్తామని చెప్పారు. తమ జీతం నుంచి ఆ ఖర్చు చేయలేం కదా అని అన్నారు. ఈ సంభాషణనను అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి వైరల్ చేశారు. దీంతో ఆ MRO సస్పెండ్ అయ్యారు.