Challa Family Issue : మాజీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కుటుంబ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఈసారి కుటుంబ సభ్యులు పరస్పరదాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంటి వద్ద పార్కింగ్, పిల్లల విషయంలో ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. నంద్యాల జిల్లా అవుకుకు చెందిన దివంగత నేత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వం కోసం విభేదాలు వచ్చాయి. చల్లా భగీరథ రెడ్డి సతీమణి చల్లా శ్రీలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యుల మధ్య శనివారం ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారట. ఈ ఘర్షణతో గాయాలు కావడంతో చల్లా శ్రీలక్ష్మి బనగానపల్లి ఆసుపత్రిలో చేరారు. చల్లా శ్రీదేవి అవుకు ఆసుపత్రిలో చేరారు.