చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం
అయితే ఇండియా కూటమిలో చేరమని చెప్పేందుకే పీకే చంద్రబాబును కలిశారన్నారు. బాబాయ్‌ను హత్య చేసేందుకు పీకేనే ప్లాన్ చేశారని, జనాన్ని రెచ్చగొట్టడానికే కోడికత్తి డ్రామా టీడీపీ చేసిన విమర్శలు మర్చిపోయారా? అని ప్రశ్నించారు. మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో చంద్రబాబు పీక కోయించుకుంటారా?. ఏం చేస్తారో వాళ్లకే తెలియాలన్నారు. లోకేశ్ తండ్రిని చంపడానికి ప్లాన్ చేస్తున్నారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ బీజేపీతో చర్చలు జరుపుతుంటే, మరో పీకే ప్రశాంత్ కిషోర్ ఇండియ కూటమి, మమతా బెనర్జీ, కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మరోసారి తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నారన్నారు.